Home Page SliderNational

వన్ ర్యాంక్ – వన్ పెన్షన్‌పై సుప్రీం తాజా నిర్ణయం

వన్ ర్యాంకు- వన్ పెన్షన్ విధానంలో అర్హులైన సాయుధ దళాలకు త్వరలో బకాయిలు చెల్లించాలని సుప్రీం కోర్టు సూచించింది. ప్రభుత్వ ఇబ్బందులను కూడా గమనిస్తున్నామని, బడ్జెట్ పరిమితంగా ఉండడం వలన ఒకేసారి అందరికీ చెల్లించడం సాధ్యం కాదని, కానీ ఒక ప్రణాళికతో చెల్లించాల్సిన అవసరం ఉందని తెలియజేసింది. ముందుగా మర ణించిన సైనిక కుటుంబాలకు, గ్యాలంటరీ విజేతలకు ఏప్రిల్ 30 లోపు బకాయులు చెల్లించాలని ఆదేశించింది.  70 ఏళ్లు పైబడిన పెన్షన్ దారులకు జూన్ 30 లోపు చెల్లించాలని సూచించింది. మిగిలిన ఫించన్ దారులకు ఫిబ్రవరి 28, 2024 నాటికల్లా బకాయిలు చెల్లింపు పూర్తి చేయాలని ఆదేశించింది. 2022 నాటి సుప్రీం తీర్పును కేంద్రం అమలు పరచాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు పరచాలని, సీల్డ్ కవర్ నివేదికలు ఎందుకని, కోర్టుల్లో పారదర్శకత ఉండాలని సుప్రీం సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.