NationalNewsNews Alert

గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. గతంలో ఆయన ఈ అక్రమ తవ్వకాల కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్‌ అయ్యారు. అనంతరం తాత్కలిక బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆయన ఇటీవల బెయిల్ నిబంధనలను సడలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐతే తాజాగా సుప్రీంకోర్టు గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా వెంటనే ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆరు నెలల్లో దీనికి సంబంధించిన విచారణ  పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ  నేపథ్యంలో గాలిజనార్ధన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.