NewsNews AlertTelangana

ఉచితం స్కీములు ఎత్తేయండి

Share with

మన దేశంలో ఎన్నికలొస్తున్నాయంటే చాలు, వరద ప్రవాహంలా రాజకీయనాయకుల నోట ఉచిత హామీల కుంభవృష్టి కురుస్తుంది. మాకు ఓటు వేస్తే మీకు బియ్యం ఉచితం, సరుకులు ఉచితం, కరెంటు ఉచితం అంటూ ఒకరిని మించి ఒకరు, ఒక పార్టీని మించి మరొక పార్టీ జనాలను ఊదరగొట్టేస్తూ ఉంటాయి. ఈ మధ్య మామూలు సరుకులే కాదు. అమ్మాయిల పెళ్లిల్లు, పేరంటాలకు కూడా స్కీములు, దళిత వర్గాల వారికి లక్షల్లో దానాలు కూడా బాగా ఎక్కువైపోయాయి. ఈ విషయంలో ఈ మధ్య సుప్రీం కోర్టు చాలా సీరియస్ అయ్యింది. రాజకీయపార్టీలు స్వీయ ప్రయోజనాల కోసం ఉపన్యాసాలు దంచికొట్టి, తీరా గెలిచాక బడ్జెట్‌ను బట్టి కొన్ని అమలుచేసి, మిగతావాటిని పట్టించుకోరు. దేశ ఆర్థికవ్యవస్థకు పెనుభారంగా మారే ఇలాంటి స్కీమ్‌ల (స్కామ్) వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. మొత్తం దేశాన్నే పట్టి పీడిస్తున్న సమస్య. సాధ్యంకాని, బడ్జెట్‌పై భారం ఎక్కువయ్యే ఉచిత వాగ్దానాలకు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేసారు. అటువంటి రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు.

ఆయా పార్టీల ఎన్నికల గుర్తును స్వాధీనం చేసుకోవాలని, లేదంటే పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞాపన చేసారు. ఆపిటీషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేసింది. ఇది చాలా సీరియస్ అంశమనీ, దీని పరిష్కారం కోసం ఫైనాన్స్ కమీషన్ సూచనలను కోరమని సూచించింది. భారతప్రభుత్వానికి ఇప్పటికే ఆరున్నర లక్షల కోట్ల అప్పులున్నాయని, ఈ హామీలను నియంత్రించకపోతే, భారత్ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని పిల్ వేసిన అశ్విని ఉపాధ్యాయ్ విచారం వ్యక్తం చేసారు. ఈమధ్యనే ప్రధాని మోదీ ఉచిత పథకాలు ఓటర్లకు మిఠాయి వంటిదని వాఖ్యానించారు.

ఉచితహామీల విషయంలో పార్టీలను నియంత్రించడం తమ వల్ల కాదంటూ ఎన్నికల సంఘం బంతిని సుప్రీంకోర్టులో నెట్టింది. మాజీమంత్రి , కాంగ్రెస్ నాయకుడూ అయిన కపిల్ సిబల్ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసారు. ఉచిత పథకాల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం కుదరదని అది రాజకీయ రంగు పులుముకుంటుదని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులను ఆర్థక సంఘం ద్వారా నియంత్రించగలరేమో తెలుసుకోవాలన్నారు. కానీ మనదేశంలో పరిస్థితులను చూస్తే అధిక జనాభా, అధిక సంఖ్యలో పేదలు ఉన్న ఈ దేశంలో ఇలాంటి స్కీములను నియంత్రించడం అంత సులువైన పని కాదని రాజనీతిజ్ఞుల సలహా.