Home Page SliderNational

సైనికాధికారుల పెన్షన్ జాప్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

సైనికాధికారులకు అమలు చేస్తామని కేంద్రం చెప్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంపై జాప్యం జరుగుతోందని సుప్రీం కోర్టు మండిపడింది. పదవీ విరమణ పొందిన సైనికాధికారులకు పింఛన్ చెల్లించడంలో కేంద్రప్రభుత్వం విఫలమయ్యిందని అసహనం వ్యక్తం చేసింది. దీనితో కేంద్రానికి రూ. 2 లక్షలు జరిమానా విధించింది. రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంతకాలం వేచి చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోందని, ఈ నవంబర్ 14లోగా సమస్య పరిష్కారం కాకపోతే, పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.