Andhra PradeshNationalNewsNews AlertTelangana

జాతీయ అవార్డు విజేతలకు మెగాస్టార్ శుభాకాంక్షలు

Share with

68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు సొంతం చేసుకున్న నటీనటులు, చిత్రబృందాలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉత్తమనటుడి అవార్డు గెలుచుకున్న సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు… అవార్డు వచ్చినందుకు  ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు చిరంజీవి. అలాగే అజయ్‌దేవగణ్‌కు మూడోసారి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేసారు. దక్షిణాదికి చెందిన తమన్‌కు, నాట్యం చిత్రబృందానికి కలర్‌ఫొటో, సూరారైపొట్రు చిత్రబృందాలకు అభినందనలు తెలియజేసారు చిరంజీవి. ఇంకా చిరంజీవితో పాటు మోహన్‌లాల్, మముట్టి,శరత్‌కుమార్,రాధిక, సుహాసిని, కాజోల్,మాధవన్,మంచువిష్ణు వంటి సినీప్రముఖులు కూడా అవార్డులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసారు.

ఉత్తమ చిత్రం :  సూరయైపొట్రు’  ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్ ఉత్తమ నటి :  అపర్ణ బాలమురళి  ఉత్తమ దర్శకుడు :  కె. ఆర్. సచ్చిదానందన్  (అయ్యప్పమ్ కోషియమ్)ఉత్తమ నేపథ్యం సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్  బెస్ట్‌ కొరియోగ్రఫీ – నాట్యం (తెలుగు) ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు) ఉత్తమ సంగీత దర్శకుడు – తమన్‌.  ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ ఎంపికైంది. ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లోనటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్‌ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.  ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్‌ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్‌ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు.  దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్‌ (28 కేటగిరీలు), నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ (22 కేటగిరీలు), బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్‌, మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు