ఈ నెల 29నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ఏపీలోని పాఠశాలలకు ఈనెల 29వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అయితే చివరి రోజున విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల రిపోర్ట్ కార్డును అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2023-24 విద్యా సంవత్సరం తిరిగి జూన్ 12వ తేదీన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


