Andhra PradeshHome Page Slider

న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని సూసైడ్

స్నేహితురాలు న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్పలేదని ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అనంతపురంలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో జరిగింది. విడపనకల్లు మండలం పాల్తూరు చెందిన చిన్న తిప్పమ్మ.. అనంతపురం శివారు బళ్లారిరోడ్డులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.. అక్కడే కాలేజీ హాస్టల్ లో ఉంటోంది. తిప్పమ్మకు అదే కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థినితో స్నేహం ఉంది. ఈ ఇద్దరమ్మాయి సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి హాస్టల్ లో విద్యార్థులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అయితే.. తన స్నేహితురాలు తనకు శుభాకాంక్షలు చెప్పలేదని చిన్నతిప్పమ్మ మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున కాలేజీ హాస్టల్ మెస్ లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.