Andhra PradeshHome Page Slider

టీచర్ గోడ కుర్చీ వేయించారని స్టూడెంట్ సూసైడ్

రాష్ట్రమంతటా ప్రభుత్వం పేరెంట్ టీచర్ మీటింగ్ లు నిర్వహిస్తుంటే అనంతపురంలో జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రాయదుర్గంలో ఉన్న ఓ పాఠశాలలో లెక్కలు సరిగా చేయడం లేదని పదో తరగతి విద్యార్థిని మాథ్స్ టీచర్ అబ్దుల్ నయీమ్ గోడ కుర్చీ వేయించారు. దీంతో అవమానం భరించలేక విద్యార్థి బాలు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.