హైదరాబాద్ ఐఐటీలో విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డంతో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం రాహుల్ ఎంటెక్ చదువుతున్నాడు. ఐఐటీ బ్లాక్ లోని 107వ నెంబర్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇందుకు గల కారణాలు ఏంటో ఇంకా వెల్లడి కాలేదు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం రాహుల్ తల్లిదండ్రులకు తెలియపరిచారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రాహుల్ మృత దేహాన్ని నంద్యాల తరలిస్తున్నారు.

