Home Page SliderTelangana

డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు ..

డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి అధికారులు, జిల్లా కలెక్టర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లు,  సీనియర్ ఎంటమాలజీ, ఏ  ఎం హెచ్ ఓ లు, తహశీల్దార్ లు, అసిస్టెంట్ ఎంటమాజిస్ట్ లు చేపట్టాల్సిన కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు. డెంగ్యూ పాజిటివ్ కేసులన్నింటినీ తనిఖీ చేయాలని, ప్రతిరోజు బస్తీ దవాఖానాలను, పట్టణ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని జోనల్ కమిషనర్లు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా, ఇతర విక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమం తప్పకుండా డిసిలు, యస్ ఈ లు, ఏ ఈ లతో  సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. 

అన్ని పాఠశాలలు కళాశాలలు హాస్టల్లను సందర్శించి డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని,  ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్లమ్ ఏరియాలో పాజిటివ్ కేసులు గల ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యక్రమాలు  నిర్వహించాలని, సీనియర్ ఎంటమాలజిస్టులు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ప్రతిరోజు 5 నుండి ఆరు ప్రాంతాలను తప్పకుండా రీ చెక్ చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా జిహెచ్ఎంసి లో చేపట్టిన చర్యలు:

* డెంగ్యూ నివారణకు  ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. వర్షాకాలం ముందు నుండి ఇప్పటి వరకు  పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

*   27,608 ప్రాంతాల్లో/ ప్రదేశాలలో  ఆంటీ లార్వా ఆపరేషన్ లు నిర్వహించారు. 

*  అందులో 9680 లాక్డ్ హౌసెస్, 767 ఫంక్షన్ హాళ్లలో, 6157 లాయింగ్ ఏరియా, ఓపెన్ ప్లేస్ , 4635 సెల్లర్స్, 6370 కన్స్ట్రక్షన్ సైట్ లలో, 3045 పాఠశాలలు, 427 కళాశాలలు, 554 హాస్టళ్లలో ఐఈసి కార్యక్రమాలు నిర్వహించారు.

*  నగర వ్యాప్తంగా ఉన్న స్లమ్ ఏరియాలో పాజిటివ్ నమోదైన కాలనీలలో పిన్ పాయింట్ ప్రోగ్రాం ద్వారా ఫాగింగ్ చేశారు. 

*  4846 కాలనీలలో ఇంటింటి తో పాటు ప్రతి శుక్రవారం డ్రై డే  ఐఈసి కార్యక్రమాలు నిర్వహించారు.

*  అదే విధంగా వెక్టర్ బ్రోన్ వ్యాధుల పైన రెసిడెన్షియల్ అసోసియేషన్, ప్రతినిధులు కాలనీ ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

*  2751 మంది  ఆయా పాఠశాల విద్యార్థుల వాలంటీర్లు గా గుర్తించి వారి తో డెంగ్యూ వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవగాహన  ఇవ్వడం జరిగింది.

*  డెంగ్యూ జ్వరం వచ్చిన బాధితులకు 4- 5 రోజుల్లోనే  డెంగ్యూ ఎలిసా టెస్ట్ ద్వారా  గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటున్నారు.