కూల్చడం మాని ఏదైనా కట్టి చూపించండి…
వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని చంద్రబాబు విమర్శించారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరిస్తారా? అని ప్రశ్నించారు. అసలు ఏనాడైనా రహదారులు వేశారా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ పర్యటన అడ్డుకుంటేనో… టీడీపీ పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పై చేయి సాధించలేరన్నారు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూపించండి.. కట్టిన దానికి ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుందని అని చంద్రబాబు తెలిపారు.

