చింత చెట్టుకు పారుతున్న కల్లు..
మీరు ఎప్పుడైనా చింత చెట్టుకు కల్లు పారిన వింత ఘటన ఎక్కడైనా చూశారా? అయితే.. ఇక్కడ మాత్రం అలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పరిధిలో చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కల్లు రావడం సహజం. అయితే.. ఇందుకు భిన్నంగా స్థానిక వెలుబెల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర ఓ చింత చెట్టుకు ఇవాళ కల్లు రావడం చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ విచిత్ర ఘటనను చూసేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.

