శ్రీలంక ఓటమి, భారత్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ బెర్త్ ఖరారు
న్యూజిలాండ్‌ను ఓడించడంలో శ్రీలంక విఫలం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ భారత్ బెర్త్ ఖరారు
శ్రీలంకతో 2 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్టులో కివీస్ గెలుపు
శ్రీలంక ఓటమితో వరల్ట్ టెస్ట్ ఫైనల్‌కు భారత్
భారత క్రికెట్ జట్టు అధికారికంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ ఆడేందుకు… ఆస్ట్రేలియా ముందుగానే, చోటు దక్కించుకోగా… రెండో స్థానాన్ని టీమ్ ఇండియా సాధించింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ ఫైనల్ బెర్త్ అర్హత పొందింది. వర్షంతో ఆట ఆలస్యమైనప్పటికీ, 5వ రోజు 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ విజయవంతంగా ఛేదించింది. WTC ఫైనల్ వేటలో కొనసాగడానికి శ్రీలంక న్యూజిలాండ్‌పై రెండు టెస్టులను గెలవాల్సి ఉంది. కానీ వారు ఆ పని చేయలేకపోయారు.
కేన్ విలియమ్సన్ చివరి పరుగులతో శ్రీలంకపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టంగా చెప్పాల్సి ఉంటుంది. న్యూజీలాండ్-శ్రీలంక మ్యాచ్ చివరి రోజు, చివరి బంతికి కివీస్ విజయం సాధించడం చరిత్రగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చివర్లో న్యూజిలాండ్ ఒక్కో వికెట్‌ను కోల్పోతూ వచ్చింది. కానీ, విలియమ్సన్ సిరీస్‌లో 1-0తో విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడు. WTC ఫైనల్ రేసు నుండి శ్రీలంకను, న్యూజీలాండ్ తప్పించేసింది.

వాస్తవానికి… టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నేరుగా ఇండియా వెళ్లాలంటే… ఆసీస్‌పై విజయం తప్పనిసరి. అయితే మొదటి టెస్టులో శ్రీలంక న్యూజిలాండ్‌ను ఓడించలేకపోవడంతో టీమిండియా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డ్రా చేసుకోగలిగినా, ఓడినా పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఐతే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక టెస్టు 4వ రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ వచ్చింది. 5వ రోజు ఆట ప్రారంభానికి ముందు వర్షం కురిసింది. అయితే అనూహ్యంగా వర్షం తగ్గిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. కేన్ విలియమ్సన్ తన 27వ టెస్ట్ సెంచరీని నమోదు చేసి కివీస్ కోసం స్కోరింగ్ చార్ట్‌లలో అగ్రగామిగా నిలిచాడు. డారిల్ మిచెల్ 86 బంతుల్లో 81 పరుగులు చేసి శ్రీలంక ఓటమికి కారకుడయ్యాడు. సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కివీస్ సాధించింది.

