నవజాత శిశువుల రక్షణ కోసం దుబాయ్‌లో ప్రత్యేక రూల్స్
నవజాత శిశువుల రక్షణ, ఆరోగ్యం కోసం దుబాయ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. దేశంలో కొత్తగా జన్మించిన శిశువులకు వైద్యపరీక్షల విధానాలను మెరుగు పరిచే ఉద్దేశంతో కొన్ని రూల్స్ పాటించాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. వారికి అవసరమైన లేబొరేటరీ, క్లినికల్ పరీక్షల జాబితాను సిద్ధం చేయడం, దేశవ్యాప్తంగా రిఫరెన్స్ లేబొరేటరీలను గుర్తించడం ద్వారా ముందస్తు ఆనారోగ్య సమస్యలను గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొంది. వీటిలో రక్త పరీక్షలు, జన్యు పరమైన పరీక్షలు, జీవక్రియలు, ఎండోక్రైన్ రుగ్మతలు, వినికిడి లోపాలు, గుండె సంబంధిత సమస్యలు వంటి తీవ్ర అనారోగ్యాలను మొదటి దశలోనే గుర్తించే అవకాశాలున్నాయి. అంతేకాక, శిశువులకు సంబంధించిన జన్యుపరమైన వ్యాధుల డేటాబేస్ కూడా తయారు చేయాలని ఆసుపత్రులకు ఆదేశించింది. వారిలో రోగనిరోధక శక్తి పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల కోసం చిన్న వయస్సు నుండే కసరత్తులు చేయాలని పేర్కొంది.

