Home Page SliderNational

జాతీయనటుడు అల్లుఅర్జున్‌కు ‘శ్రీవల్లి ‘సాంగ్‌తో ప్రత్యేక అభినందనలు

ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అనే పిలుపుల నుండి నేషనల్ స్టార్‌గా  మారిన అల్లుఅర్జున్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ వీణా విద్వాంసురాలు వీణా శ్రీవాణి. పుష్ప చిత్రంలో నటనకి అల్లుఅర్జున్‌కు జాతీయ ఉత్తమనటుడి అవార్డు ప్రకటించిన విషయం మనకు తెలిసినదే. గతంలో తెలుగు చిత్రపరిశ్రమలో ఏ హీరోకు దక్కని ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి నటుడిగా నిలిచారు అల్లుఅర్జున్. దీనితో ప్రముఖులందరి నుండి అల్లుఅర్జున్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు పొందిన బన్నీకి స్పెషల్‌గా పుష్ప చిత్రం నుండి సూపర్‌హిట్ అయిన ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ’ అంటూ సాగే పాటను వీణతో వాయించి అభినందించారామె. ఈ పాటను చూసిన బన్నీ ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు.