ఈడీకి సోనియా వినతి
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడివున్న మనీలాడరింగ్ కేసు విచారణ విషయమై ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోమవారం ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో జూన్ 8న హాజరు కావాలని మెుదట సోనియాకు నోటీసులు అందాయి. కానీ సోనియాకు జూన్ 2న కరోనా సోకడంతో కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఐనా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జూన్ 12న ఆసుపత్రిలో చేరారు. దీంతో విచారణను… ఈడీ జూన్ 23నకు వాయిదా వేసింది. ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి అయ్యాక ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌లు సూచించడంతో జూన్ 23న విచారణకు హాడరుకాలేనని, మరో నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ఈడీకు సోనియా తెలిపారు.