Home Page SliderNational

ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం

లోక్‌సభ ఘటనపై సోనియా గాంధీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటిలో ఈ విషయమై సోనియా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రధాని మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ఉరి బిగించిందని మండిపడ్డారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై విలువ లేకపోవడమేనని విమర్శించారు. న్యాయమైన డిమాండ్లు లేవనెత్తిన విపక్ష పార్టీలను సస్పెండ్ చేస్తారా. పార్లమెంటులో భద్రతా నియమాల ఉల్లంఘనపై ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.