ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఉపఎన్నికలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో నిలిచాడు. ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన బరిలోకి దిగకపోవడంతో… ఆత్మకూరులో పోటీ వైసీపీ, బీజేపీ మధ్య నెలకొంది. ఉపఎన్నికలో మొత్తం 14 మంది సభ్యులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,138 మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి తీరాలని భావిస్తున్న వైసీపీ అందుకు తగిన విధంగా పార్టీ నేతలను మోహరించింది. సానుభూతి పవనాలు వీస్తున్నా… ఉపఎన్నికలో ఓటుకు నోటు పెద్ద ఎత్తున పంచినట్టు తెలుస్తోంది.