రాష్ట్రపతిపై సోనియా, ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా మాట్లాడుతూ రాష్ట్రపతి అంతసేపు మాట్లాడకుండా ఉండవలసింది. అలా చదువుతూనే పోయారు. బాగా అలిసిపోయారు. అంటూ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ అయితే రాష్ట్రపతి బోరింగ్‌గా మాట్లాడుతూ పోయారు. ‘పూర్ లేడీ’, ‘వెరీ బోరింగ్’, ‘నో కామెంట్’ అంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై బీజేపీ మండిపడింది. సోనియా వంటి ప్రతిపక్ష నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును జమిందారీ మైండ్ ఉన్న కాంగ్రెస్ అంగీకరించలేకపోయింది. అంటూ బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ విమర్శలు కురిపించారు.

