కేసీఆర్‌ది నోరా తాటిమట్టనా..?
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తానని.. నాతో చర్చకు సిద్ధమా అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌ది నోరా తాటిమట్టానా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. కుటుంబ పార్టీల పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అబద్దాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కుటుంబ పార్టీలు బలోపేతం కావడానికి రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు సంక్షేమం పేరుతో జగన్ అభివృద్ధిని పక్కన పెట్టారని విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను తొలగినందుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షలో సోము వీర్రాజు పాల్గొన్నారు. దళితులకు కేంద్రం నుంచి వచ్చే లోన్లు మన రాష్ట్రంలో రావడం లేదని.. ఆ డబ్బు సీఎం ఎటువైపు మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

