NationalNews

సూర్యగ్రహణం.. ఏది నిజం.. ఏది అబద్ధం…

మరికాసేపట్లో ఆరంభం కాబోతున్న సూర్యగ్రహణం చాలా చాలా పాక్షికమైనది. అత్యంత స్వల్పం. సూర్యగ్రహణ కాలం వాస్తవానికి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుంచి 6 గంటల 32 నిమిషాల పాటు మాత్రమే జరగాల్సి ఉంది. కానీ 5.33 నిమిషాలకు సూర్య అస్తమయం జరుగుతుంది. కేవలం 30 నిమిషాలు మాత్రమే గ్రహణ స్పర్శ కాలం ఉంది. గ్రహణ మధ్య కాలం రాలేదు. గ్రహణ విడుపు లేకుండా సూర్యాస్తమయం జరుగుతుంది. గ్రహణ మధ్య కాలం ఉంటే.. గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండేది. అప్పుడు మాత్రమే… గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణ మధ్య కాలమే ఉండబోవడం లేదు. స్పర్శ కాలం మాత్రమే ఉంటుంది. గ్రహణ మధ్య కాలమూ లేదు.. విడుపు కాలమూ లేదు. చాలా చాలా స్వల్పమైన గ్రహణం తాజాగా రాబోతోంది. దీని స్వభావం అత్యల్పం. గ్రహణం వీడితే అప్పుడు గ్రహణ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. కానీ సూర్యుడు గ్రహణ కాలంలోనే అస్తమిస్తున్నందున నిబంధనలు వర్తించవన్నది కొందరు సిద్ధాంతుల వాదన. ఐతే కొందరు గ్రహణం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని… గోరంత ఉన్నదానిని కొండంత ప్రచారం చేస్తున్నారనన విమర్శలు విన్పిస్తున్నాయి. ఐతే దేవాలయాలకు స్పర్శ తగులుతుంది కాబట్టి మూసివేస్తున్న విషయాన్ని గ్రహించాలంటున్నారు.