హైదరాబాద్‌లో జగన్ పాటకు చిందేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
హైదరాబాద్‌లో మాదాపూర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్ వద్ద విచిత్రం జరిగింది. వినాయక నవరాత్రి సందర్భంలో పెట్టిన మండపం వద్ద నిమజ్జన వేడుకలలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పాటలకు ఉత్సాహంతో చిందులు వేశారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. “జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెలో గుడి కట్టడమే మా ఎజెండా” అంటూ ఈ పాట సాగుతోంది. ఏపీ రూపురేఖలను మార్చేశాడంటూ, ప్రభుత్వాన్ని ఇళ్ల వద్దకు తీసుకువచ్చారంటూ సాగే ఈ పాటకు ఇక్కడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డ్యాన్సులు చేయడం వైరల్‌గా మారింది. దీనితో జగన్ పవర్ ఇంకా తగ్గలేదంటూ కామెంట్లు చేస్తున్నారు జగన్ అభిమానులు.


 
							 
							