శరవణ బ్రాండ్… 50 ఏళ్ల వయసులో హీరో రోల్
చాలా మంది చిన్నప్పటి మనం అది చేయాలి , ఇది చేయాలి అని కలలుకంటూ ఉంటారు. కొంమంది వాటిని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తారు , మరికొందరు ఇది మన వల్ల కాదు అని , వారు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్లక్షం చేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులకు ఓ సమాధానంగా నిలుస్తున్నారు ,” ది లెజండ్” హీరో అరుళ్ శరవణన్ . 50 ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. ఇంతకీ ఎవరు ఈ అరుళ్ శరవణన్ అనుకుంటున్నారా ? అవును ఆయనకు, శరవణ స్టోర్స్‌కు చాలా పెద్ద లింకే ఉంది. శరవణ స్టోర్ పేరు విననివారంటూ పెద్దగా ఉండరు. మరి ముఖ్యంగా తమిళనాడులో ఈ పేరు వినని వారు ఉండరు. ఈ రిటైల్ స్టోర్స్‌లో దొరకని వస్తువంటూ ఉండదు. శరవణ స్టోర్స్ వ్యవస్దాపకుల్లో ఒకరైన శరవణన్ సెవరత్నమ్ కుమారుడే ఈ అరుళ్ శరవణన్. ఈయన చెన్నైలో జన్మించారు. తండ్రి వ్యాపార వేత్త కావడంతో అరుళ్ తన చదువు పూర్తయిన వెంటనే వ్యాపార నిర్వహణలోకి దిగారు.
నగలు , దుస్తులు , ఫర్నీచర్ ఇలా వ్యాపారలలో మంచి లాభాలను సాధించారు. 2019లో శరవణ స్టోర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా , హీరోయిన్ తమన్న , హన్సికలతో ఆయన చేసిన ఓ ప్రమోషన్ చాలా ట్రెండ్ అయ్యింది. చిన్నప్పటి నుండి సినిమాల్లోకి రావాలి , నటించాలన్న కోరిక ఉన్నప్పటికి కొన్ని కారణాలతో అది సాధ్యమవలేదు. కానీ ఆయన నటించిన నాటి ప్రకటనకు క్రేజ్ రావడంతో… ఎలాగైన నటుడిగా మారాలని అరుళ్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన నిర్మించే చిత్రాన్ని ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ పతాకంపై తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. జె .డి.జెర్రీ దర్శకత్వంలో , హ్యరీస్ జైరామ్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాకు “ది లెజండ్ ” అనే టైటిల్ ప్రకటించడంతో పాటు , ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. దీనిలో శరవణన్ శాస్త్రవేత్తగా , బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెల కథానాయికగా నటించింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్‌లో అరుళ్ ఫుల్ బీజీగా ఉన్నారు.