Home Page SliderInternationalNews AlertTrending Todayviral

ఆకాశంలో స్మైల్ ఇమేజ్..

ఆకాశంలో ఏప్రిల్ 25న అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. శుక్ర, శని గ్రహాలు కళ్లుగా, చందమామ స్మైల్ ఇస్తున్న చిరునవ్వుతో ఉన్న పెదాలలాగ కనిపించే ఈ అందమైన ఇమేజ్‌ను మేఘాలు లేకపోతే మామూలు కళ్లతో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు ప్రకాశవంతంగా ఉండడమే దానికి కారణం. వాటి కింద బుధ గ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రాండ్ కాల్బెర్ట్‌సన్ వెల్లడించారు. తూర్పు దిశగా భూమి, సముద్రం ఒక రేఖ వద్ద ఆకాశంతో కలుస్తున్నట్లు ఉన్న దీనిని చూడవచ్చు.