Andhra PradeshHome Page Slider

సింహాచలం చందనోత్సవ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం. అక్కడ వెలసిన శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగ్రనారసింహునికి ప్రతీ రోజూ చందనంతో లేపనం పూస్తారు. ఇలా ఒక సంవత్సరం పాటు పూసిన చందనాన్ని అక్షయతృతీయ నాడు ఒలుస్తారు. ఇలా సంవత్సరానికొకసారి మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే ఆ స్వామిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. అక్షయతృతీయ నాడు స్వామి చందనం ఒలిచే కార్యక్రమం ఉంటుంది. తర్వాత రోజు చందనోత్సవం చేస్తారు. ఈ నెల 23న జరుగబోయే ఈఉత్సవానికి ఘనమైన ఏర్పాట్లు చేశారు. దీనికి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. 300 రూపాయలు, 1000 రూపాయల టిక్కెట్లను www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంకా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకుల ద్వారా కూడా విక్రయిస్తున్నట్లు దేవస్థానం తెలిపింది.