InternationalNews

జపాన్ మాజీ ప్రధానిని దుండగుడు ఎలా కాల్చాడు

Share with

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేపై దుండగుడు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. షింజే ఛాతీపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. షింజో అబే పల్మనరీ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటన తర్వాత వైద్య బృందాలు ఆయన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఉదయం 11:30 గంటలకు ఘటన జరిగింది. షూటర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ప్రధాన మంత్రి అబే పరిస్థితి ఎలా ఉందో తెలియదన్నారు జపాన్ చీఫ్ సెక్రటరీ హిరోకాజు మట్సునో. 40 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి… అబేను వెనుక భాగంలో కాల్చినట్లు విజువల్స్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. ముందస్తు పథకం ప్రకారం జపాన్ మాజీ ప్రధానిని హతమార్చే ప్రణాళికలో భాగంగా అతను వచ్చినట్టు కన్పిస్తోంది. నిందితుడి నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అబేపై దుండగుడు రెండు సార్లు కాల్పులు జరిపాడు.

67 ఏళ్ల షింజో అబే… ఎన్నికలో ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండోసారి ఫైరింగ్‌తో అబే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. షింజో అబేను దుండగుడు వెనుక నుంచి కాల్చి చంపాడు. జపాన్‌లో ఎవరైనా ఆయుధాలు కలిగి ఉంటడం అతి వీజీ కాదు… కానీ జపాన్‌లో కఠినమైన తుపాకీ చట్టాలున్నాయ్. జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో రికార్డు సృష్టించారు. 2006లో ఏడాది పాటు… ఆ తర్వాత 2012 నుండి 2020 వరకు ప్రధానిగా వ్యవహరించారు. కాల్పుల ఘటనను భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించాడు. స్నేహితుడిపై దాడితో వేదనకు గురయ్యానన్నారు మోదీ.