NationalNews

భార్యను రైలు కిందకు తోసేశాడు..!

రైల్వేస్టేషన్‌లో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది.రైల్వేస్టేషన్‌లో ఒక మహిళ తన పిల్లలతో కలిసి నిద్రిస్తుంది. అంతలోనే ఒక వ్యక్తి ఆమెను నిద్ర లేపాడు. ఒక్కసారిగా ఆమెను అప్పుడే వస్తున్న రైలు కిందకి అమాంతం తోసేశాడు. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరు చిన్నారులను ఎత్తుకొని పారిపోయాడు. ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ హృదయ విదారక దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ముంబయికి సమీపంలోని వసాయ్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం మధ్యహ్నం నుంచి నిందితుడు ,మృతురాలు,ఇద్దరు పిల్లలు వసాయ్ రైల్వేస్టేషన్‌లోనే ఉన్నారు. ఆ రోజు రాత్రి స్టేషన్‌లోని బల్లపైనే అందరూ నిద్రిపోయారు. అయితే తెల్లవారు జామున 4 గంటల సమయంలో నిందితుడు నిద్రిస్తున్న మహిళను లేపాడు. ఆమెతో కొన్ని సెకన్ల పాటు మాట్లాడాడు. అదే సమయంలో స్టేషన్‌లోకి వస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ కిందకు ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. దీంతో రైలు కింద పడిన ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. దాంతో అప్పటికే బల్లపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను నిద్ర లేపి..వారిని ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించాడు.  ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు అక్కడి నుంచి మొదట దాదర్ ,తర్వాత కళ్యాణ్‌కు వెళ్ళాడు. చివరకు భీవండిలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు రైలు కిందకి తోసేసిన మహిళ అతని భార్య  అయ్యుండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.