NewsTelangana

తెలంగాణ డీజీపీకి షాక్

Share with

ఆయన పోలీసులకు పోలీస్… రాష్ట్ర పోలీసు విభాగానికి చీఫ్. ఆయన పేరు చెప్తే బయపడేవాళ్లను చూశాం కానీ.. ఆయన్నే భయపెట్టేలా… ఇతరులకు ఆయన ప్రొఫైల్ పంపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి డీపీని ఉపయోగించి… జనాల్ని భయపెట్టి కోట్లు గుంజాలనుకొన్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 9785743029 నంబరుకు మహేందర్ రెడ్డి డీపీ పెట్టి చీటింగ్ ప్లాన్ రూపొందించారు సైబర్ నేరస్తులు. ఏం చేస్తే ఏంటి… ఎలా చేస్తే ఏంటి.. కాసులు దండీగా పోగేసుకోవాలి.. పనీపాటా లేకుండా ఎంచక్కా జీవితాన్ని ఎంజాయ్ చేసేయాలి. ఇదీ సైబర్ నేరగాళ్ల లైఫ్ ఫిలాసఫీ.. పోలీస్ ఉన్నతాధికారులకు , ప్రముఖులకు , సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్‌లు పంపిస్తూ… అందినకాడికి గుంజుకోవాలని రంగం సిద్ధం చేశారు. డీజీపీ పేరును దుర్వినియోగం చేస్తున్న కేటుగాళ్లు ఇంకేం చేస్తారోనన్న టెన్షన్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.