NationalNews

విపక్షాలపై మోదీ సెటైర్లు

Share with

విపక్షాలకు దేశం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యయ్యాయన్న ప్రధాని మోదీ

పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. సిద్ధాంతం, రాజకీయ ప్రయోజనాలు… సమాజం, దేశం కంటే ఎక్కువ డామినేట్ చేస్తున్నాయని గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోదీ విర్శిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి సభను విపక్షాలు అడ్డుకోవడంతో సభ సజావుగా సాగడం లేదు. ధరల పెరుగుదలపై చర్చిద్దామంటూ విపక్షాలు సభను జరగనివ్వడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోలేని కొన్ని పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని మోదీ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం వల్లే పార్టీలు ఉన్నాయని, దేశం వల్లే ప్రజాస్వామ్యం ఉందని, మన దేశంలోని చాలా పార్టీలు మనుగడ సాగిస్తున్నాయన్న విషయాన్ని మరచిపోరాదన్నారు మోదీ. ఎమర్జెన్సీ సమయంలో దేశ ప్రజాస్వామ్యం అణచివేసిడినప్పుడు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఏకమయ్యాయని ప్రధాని అన్నారు. ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. నిరసన తెలియజేయాలనుకుంటే సభ వెలుపల ప్లకార్డులు పట్టుకోవాలని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించినా సభ్యులు పట్టించుకోలేదు.

సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సస్పెండ్ అయిన నలుగురు ఎంపీలతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ విలేకరులతో మాట్లాడుతూ, “ప్రభుత్వం మా ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది, వారి తప్పు ఏమిటి? వారు ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. .” కాంగ్రెస్‌ పార్టీ ఇలా దిగజారబోదని స్పష్టం చేశారు.