వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
కేంద్ర ప్రభుత్వం వాహన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కి రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఇంధన ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 8, 2025 నుండి అమల్లోకి వస్తాయి. అమెరికా పరస్పర సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాల నేపథ్యంలో, ప్రపంచ ముడి చమురు ధరలు వాస్తవానికి తగ్గుతున్న సమయంలో ఈ పెంపు నిర్ణయం వచ్చింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం చూపించనుంది. ఈ ధరల పెరుగుదల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపించనుంది.

