Home Page SliderNationalNewsTrending Today

రాష్ట్రపతి ముర్ముతో శివాంగి : ఆల్ డౌట్స్ క్లియర్

ఇంటర్నెట్ డెస్క్ : త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధవిమానంలో విహరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెతో స్కాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ రఫేల్ యుద్ధవిమానం ముందు ఫోటో దిగారు. ఈ ఫోటో వల్ల గత కొన్నాళ్లుగా జరుగుతున్న అసత్య ప్రచారానికి తెరపడింది. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి.
అసలేం జరిగిందంటే … ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు చెందిన ఒక రఫేల్ యుద్ధవిమానాలను పాకిస్తాన్ నేలకూల్చినట్లు, ఒక మహిళా పైలట్ ను బంధించినట్లు పాక్ ప్రచారం చేసుకుంది. ఆమె శివాంగి సింగ్ కావొచ్చని అప్పటి నుండి వందంతులు ప్రచారంలోకి వచ్చాయి. భారత ప్రభుత్వం, ఆమె కుటుంబసభ్యులు ఈ ప్రచారాన్ని ఖండించినా ఊహాగానాలు కొనసాగాయి. అయితే ఆమె ఆరు నెలలుగా ప్రత్యేక ప్రాజెక్టులో శిక్షణ తీసుకుంటున్నారని, దానితో ఆమె బయట కనబడడం లేదని తెలిసింది. తాజాగా ఆమె రాష్ట్రపతి ముర్ముతో దిగిన ఫోటోతో పాకిస్తాన్ అబద్దపు ప్రచారం తేలిపోయింది. రఫేల్ రాణిగా యుద్ధవిమానాలను నైపుణ్యంతో నియంత్రించే ఆమెకు త్వరలో అంతరిక్షంలో వ్యోమగామిగా విహరించాలనే లక్ష్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ చేపట్టబోయే మానవ అంతరిక్షయాత్రలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆమె ఆశ నిజమవ్వాలని కోరుకుందాం.