షిండే రాజీనామా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తనకు మద్దతుగా ముంబయికి ఎవరూ రావొద్దని, సమావేశాలు పెట్టొద్దని ట్వీట్ చేయడంతో ఆయన స్వచ్ఛందంగా రేసు నుండి తప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనితో ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి మార్గం ఏర్పడింది. ఇప్పటికే ఎన్సీపీ నుండి అజిత్ పవార్, ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో ప్రస్తుత అసెంబ్లీ గడువుకాలం ముగుస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. షిండే, ఫడ్నవీస్, అజిత్‌లతో కలిసి గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా గవర్నర్‌ను కోరారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకూ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను కోరారు.

