NewsNews AlertTelangana

కేసీఆర్ పై షర్మిల తూటాల వర్షం

Share with

గత కొంత కాలంగా  షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొన్న విద్యాసంస్ధల విషయమై ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌ను దుయ్యబట్టారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. నాణ్యత లేని పనులు , నాణ్యత లేని  కాంట్రాక్టర్‌లకు ప్రాజెక్ట్‌ని అప్పచెప్పారన్నారు. ఈ విషయంలో అధికారులు మాత్రం కాంట్రాక్టర్ తప్పు లేదు.. అది పెద్ద తప్పేం కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లను ఎందుకు వెనకేసుకు వస్తున్నారో తెలియడం లేదన్నారు.  ప్రాజెక్ట్ డ్యామేజ్ కి క్లౌడ్ బరెస్ట్ కారణం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని…  కనీసం ప్రొటెక్షన్ వాల్ కూడా సరిగా నిర్మించడం రాని కాంట్రక్టర్‌లను ఎందుకు ఎంచుకున్నారో అని ప్రశ్నించారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదని ఎద్దేవచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పాడు. అది ఒక అద్భుతం అన్నాడు  అయితే మూడేళ్లలో ఎందుకు మునిగి పోయిందో? చెప్పాలన్నారు.  కాళేశ్వరం ఒక అద్భుతం కాదు అది ఒక అద్భుతమైన అబద్ధం అని దుషించారు. 80 వేల పుస్తకాలు చదివా అని చెప్పే కేసీఅర్ చేసింది ఇదేనా? అన్నారు.  ఎన్ని ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టారో.. మళ్లీ దీని రీ డిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదువుతారో అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అది నా చెమట, రక్తం అన్నారని… ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో ఎమో అని ప్రశ్నించారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వైఎస్సార్ 33 వేల కోట్ల తో రూపొందించారన్న ఆమె.. కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ కు తలకాయ , కాళ్ళు తీసేసారన్నారు. 33 వేల కోట్ల నుంచి లక్షా 70 వేల కోట్లకు పెంచి తలకాయ అయిన ప్రాణహిత.. కాళ్ళు అయిన చేవెళ్లను కట్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఫోటోలకు టూరిస్ట్ స్పాట్‌కి తప్ప దేనికి పనికిరాని విధంగా చేశారనన్నారు. 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు కాని ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు కానీ , 55 వేల ఎకరాలకు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అసలు చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికి పొంతన లేదని దుషించారు. ఇది ప్రజల ప్రాజెక్ట్ కాదు…పూర్తిగా కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్ట్ , దోచుకోవడానికి కట్టిన ప్రాజెక్ట్ అన్నారు షర్మిల. మెగా కృష్ణా రెడ్డి , కేసీఆర్ కలిసి పట్టబగలు దోచుకున్నారన్నారు.

దోచుకోవడానికి కాకపోతే కేసీఆర్  ఎందుకు కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అసలే  మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ప్రాజెక్ట్ ల పేరుతో అప్పుల కుప్పగా మారుస్తున్నారన్నారు. అప్పులు తేవడం ..ప్రాజెక్ట్ ల మీద పెట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నట్టు ఉందన్నారు. ప్రాజెక్ట్ లను నిర్మించడంలో అసలు తెలంగాణలో ఇంకో మొనగాడే లేనట్లు కేవలం మెగా కృష్ణా రెడ్డికే  ఎందుకు ఇస్తున్నారో అన్నారు. ఇప్పటి వరకు నిర్మించిన కాళేశ్వరం ఆయనే పాలమూరు ఆయనే మిషన్ భగీరథ ఆయనకే ఎందుకు కట్టబెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు?   ఇలాంటి పరిస్థితి దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత వరకు చూడలేదన్నారు.

మెగా కృష్ణా రెడ్డి కేసీఆర్ మనిషి..అందుకే ఆయనకు కట్టబెడుతున్నారనన్నారు. మెగా కృష్ణా రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి వాట ఉందన్నారు షర్మిల. ఇందుకు కేసీఆర్ కుటుంబానికి డబ్బులు  కూడా అందుతున్నాయన్నారు. ప్రతి ప్రాజెక్ట్ మెగాకి ఇవ్వడం వెనుక ఆయన అవినీతి బయట పడుతుందన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మెగా కృష్ణా రెడ్డి కోసమా లేదా ప్రజలకు సేవా చేయడం కోసమో తెలియాల్సి ఉందన్నారు. కేసీఆర్ అధికారంలో  వీళ్ళు ఇద్దరే బాగు పడ్డారన్నారు షర్మిల. బలి దానాల మీద తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడ వీళ్లకు పనికి వస్తుందని…  మూడేళ్లలో కూలి పోయే ప్రాజెక్ట్ ను ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. కన్నెపల్లి ప్రాజెక్ట్ లో బ్రిక్స్ తో కడితే కూలి పోయింది అన్నారు , అదేవిధంగా అన్నారం పంప్ హౌజ్ లో మట్టితో కట్టారు అని చెప్తున్నారన్నారు. ఎది అడిగినా ఏదో సమాధానంతో తప్పించుకంటున్నారు.  మీకు మీకు లావాదేవీలు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిల.  దేవాదుల ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్న షర్మిల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అలా అయ్యిందో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. దేవాదుల వైఎస్ సమర్థతకి నిదర్శనమన్నారు. కాళేశ్వరం కేసీఅర్ అవినీతికి నిదర్శనం అని కేసీఆర్ పై తూటాలు విసిరారు షర్మిల.