UNOలో భారత శాశ్వత ప్రతినిధిగా మొదటిసారిగా మహిళ
ఐక్యరాజ్యసమితిలో మన భారత మహిళకు విశేష గౌరవం లభించింది. భారత రాయబారి రుచిరా కాంబోజ్ UNOకి భారత శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, UNO ఛీఫ్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు శాశ్వత ప్రతినిధిగా తన పత్రాలను సమర్పించానని, భారత మహిళ ఈ పదవిని అలంకరించడం తొలిసారని ట్విట్టర్ వేదికగా తాను బాద్యతలు స్వీకరిస్తున్న ఫొటోను షేర్ చేసారు. మనదేశంలో ఈ పదవిని పొందిన మొదటి మహిళ ఆమె. పారిస్‌లో దౌత్యాధికారిగా సర్వీస్ ప్రారంభించిన ఆమె భారత ఎంబసీలో 3వ సెక్రటరీగా పని చేసారు. తర్వాత విదేశాంగ శాఖలో చేసి, అనంతరం మారిషస్, భూటాన్, సౌతాఫ్రికాలతో పాటు మరికొన్ని దేశాలలో పనిచేసి, చివరిగా ఐక్యరాజ్యసమితి రాయబారిగా నియమింపబడ్డారు. ఈమె 1987 IFS కు ఎంపికైంది. సివిల్ సర్వీసెస్లో ఫారన్ సర్వీసెస్ విభాగంలో ఆ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం.
Read more: భారతీయులు… పాకిస్తానీలుగా ఎందుకు మారాలనుకుంటున్నారంటే..!