Andhra PradeshHome Page SliderNews Alert

సీఎం జగన్‌ను కలిసిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన నివాసంలో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎంకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రికి ప్రసాదాలు, ఆశీర్వచనం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అందజేశారు. జనవరి 27 నుంచి జనవరి 31, వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగనున్నాయి.