Andhra PradeshHome Page SliderTrending Today

త్వరలో కూతురుతో కలిసి షారూక్ సినిమా?

ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్. చిత్రపరిశ్రమలో ఇప్పుడాయన తదుపరి సినిమాల సందడి మొదలయ్యింది. ఇటీవలే ఆయన తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రాన్ని సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. షారుక్, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వచ్చే ఏడాది నవంబరులో సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి. రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను దాదాపు 6 నెలలు విదశాల్లో చిత్రీకరించనున్నారని సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం షారుక్ డంకీ సినిమా చిత్రీకరణలో ఉన్నారు.