షారుఖ్ ఖాన్ “జవాన్” ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలోనే పఠాన్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షారుఖ్ “జవాన్” సినిమాతో బాక్సాఫీసును మరోసారి షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. కాగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా “జవాన్” ట్రైలర్ వచ్చేసింది. తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ ఈ జవాన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో షారుఖ్‌కు జంటగా లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా కన్పించనున్నారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ,బీజీఎం సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

