హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హన్మకొండ సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీ కిందకి దూసుకుపోయింది. కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. అక్కడే ఉన్న స్థానికులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							