మరోసారి సంచలన వాఖ్యలతో వార్తల్లో నిలిచిన నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తరచూ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చిరంజీవి , పవన్ కళ్యాణ్‌లపై హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవిని ఉసరవెల్లిలా… పవన్ కళ్యాణ్ ను ల్యాండ్‌మైన్ అంటూ కామెంట్స్ చేసారు నారాయణ. అల్లూరి సీతరామరాజు జయంతి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణని ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు . ఉసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని వేదికపైకి తీసుకురావడం సరికాదని తెలిపారు.
ఇక పవన్ కల్యాణ్ అయితే ల్యాండ్‌మైన్ లాంటి వారని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదన్నారు. అదే కాకుండా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతివ్వడంపై… ఏపీకి కేంద్రం ఏం చేసిందని ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేశారని ప్రశ్నించారు. ఏపీ నేతలు బీజేపీ నేతల బ్లాక్‌మెయిలర్లకు భయపడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాక ఏపీకి రాజధానిని ఏర్పరిచే విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని … రాష్ట్రం విడిపోయినా గాని తెలంగాణనే ఇంకా ఏపీకి రాజధానిగా వైసీపీ భావిస్తుందని… వరద బాధితుల్ని ఆదుకోవడం… రోడ్ల భద్రత , ప్రజలకు పక్కా ఇల్లు ఇవ్వడం అనే అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.