సినిమాలు ఆడకపోవడానికి మనమే కారణం
ఓటీటీల వల్ల సినిమాలకు నష్టం లేదన్నారు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్. తాజాగా ఆయన నటించిన `లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో ఆమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు.
సినిమా కార్యక్రమంలో భాగంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ… థియేటర్లలో సినిమాలు ఆడకపోవడానికి ఓటీటీల తప్పులేదన్నారు. వాస్తవానికి సినీ ఇండస్ట్రీస్‌కు ఓటీటీలు ఎంతో మేలు చేస్తాయని, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. సినిమాలు విడుదలైన రోజుల వ్యవధిలోనే ఓటీటీలో వస్తే.. ఆడియన్స్ థియేటర్లకు ఎందుకు వస్తారని, హాయిగా ఇంటి వద్దే సినిమాలు చూడొచ్చని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. సినిమా రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటీటీలో రావాలి. అలా కాకుండా 2, 3 వారాల్లోనే సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడం మానుకోవాలని ఆమీర్ ఖాన్ సూచించారు.