NewsTelangana

చార్మినార్‌, గోల్కొండలో ఎంట్రీ ఫ్రీ

Share with

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. చార్మినార్‌, గోల్కొండ, వరంగల్‌ కోటతో పాటు భారత పురావస్తు శాఖ రక్షణలో ఉన్న స్మారక చిహ్నాలు, ప్రదేశాల్లో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు భారతీయులతో పాటు విదేశీయులకు ఉచిత సందర్శన అవకాశం కల్పించనున్నారు.


ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆగస్టు 15వ తేదీన ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఆగస్టు 15వ తేదీన జన్మించిన 12 ఏళ్లలోపు చిన్నారులకు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మిగిలిన వారికి ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్‌ ధరను రూ.120 నుంచి రూ.75కు తగ్గించినట్లు చెప్పారు.