అవినీతికి అడ్డాగా టీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న సింధియా
టీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని… ప్రజలకు కేసీఆర్ పై ఇక ఏమాత్రం నమ్మకం లేదని కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని విమర్మించారు కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా. కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. నిధుల కేటాయింపు వివరాల ఖర్చు అడిగితే చెప్పడానికి టీఆర్ఎస్ నేతలకు నోరు రావడం లేదన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ , సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిందువల్లే కేసీఆర్ భయపడుతున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో వెనుకబడిన కారణంగా పథకాలు కూడా సక్రమంగా అమలు చేయలేక పోతుందన్నారు. ఈ ప్రభుత్వం అవినీతిలో ముందు, ప్రజా సంక్షేమంలో చివర ఉందని తెలిపారు. అందువల్లే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని,త్వరలో బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 11 డివిజన్లలో గెలిచామన్నారు.17 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటి చేసి 4 స్థానాల్లో విజయం సాధించామన్నారు. ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.త్వరలోనే బీజేపీ జెండా గ్రామగ్రామాన ఎగురవేస్తామన్నారు.
అందువల్లే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పరేషాన్ అవుతుందన్నారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలన వికేంద్రికరణ ప్రవేశపెట్టిందన్నారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధులను కూడా ఘననీయంగా పెంచిందని తెలిపారు. కేంద్రం నిధులను సరైన పద్దతిలో వినియోగిస్తూ..విమానాయనలో భద్రత కోసం మరింత పగడ్బందిగా చర్యలు తీసుకుంటుందని,ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఈ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభించామని, బూత్‌స్థాయి నుంచి పార్టీనీ బలోపేతం చేస్తే పార్టీ బలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నానన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల గురించి మాట్లాడుతూ..ద్రౌపది ముర్మును అన్ని పార్టీల సభ్యులు వివక్షత లేకుండా ఓటేసి రాష్ట్రపతిగా ఘనవిజయాన్ని అందించడం చాలా ఆనందం కలిగించే విషయమన్నారు. కాగా రాష్ట్రపతిపై కాంగ్రెస్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆ విధంగా ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. అయినా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడం మానేసి సభలో అల్లర్లు సృష్టిస్తూ,కాంగ్రెస్ పార్టీ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రపతి హోదాలో ఉన్న గిరిజన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలోని ప్రజలు, మహిళలు, ఆదివాసీలకు విరుద్దం అని సూచించారు. ఎంపీ,కేంద్ర మంత్రిగా కాకుండా సామాన్య కార్యకర్తగా తెలంగాణకు వచ్చానన్నారు సింధియా. టీఆర్ఎస్ నేతలు తప్పు చేశారేమోనని… అందుకే విచారణ సంస్థలను చూసి భయపడుతున్నారన్నారు.