ప్రిన్సిపాల్ కూమారుడి దాష్టీకం!
హైదరాబాద్ మొయిన్‌బాగ్ యూనిక్ హైస్కూల్‌లో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు స్కూల్ ప్రిన్సిపాల్ కుమారుడు యాసిర్. చాక్లెట్, బిస్కెట్లు ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పలువురు బాలికలపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు న్యూడ్ వీడియోస్ ఫోన్‌లో చిత్రీకరించి విద్యార్థినులపై బెదిరింపులకు దిగాడు. పాఠశాలలోనే నిందితుడి కుటుంబం నివాసం ఉండటంతో రెచ్చిపోయాడు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో బండారం బయటపడింది. నిందితుడు యాసిర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సెక్షన్ 354(a), 509, 9(m) r/w పోక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేశారు.

పలు న్యూడ్ సెల్ఫీ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారు. యాసిర్ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ముందుగా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాసిర్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. ఫిర్యాదును మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు పేరేంట్స్ వాపోయారు. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యాసిర్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.