కేరళ విద్యార్థుల ల్యాప్‌టాప్ ప్రొటెస్ట్
నిరసనలకు ఏదీ అనర్హం కాదన్నట్టుగా ఉంది కేరళ విద్యార్థుల తీరు. త్రివేండ్రమ్ కాలేజీ విద్యార్థులు లాప్‌టాప్ ప్రొటెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. విద్యార్థులు, విద్యార్థునులు ఒకరి తొడలపై ఒకరు కూర్చొని నిరసనలు చేపట్టారు. త్రివేండ్రమ్ వద్ద పోలీసుల నైతిక ప్రవర్తకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్ వద్ద ఉన్న ఒక బెంచ్‌ను మూడు విభాగాలు చేయడాన్ని నిరసిస్తూ ఇలా ఆందోళనకు దిగారు. వాస్తవానికి బాలబాలికలు ఒకరి పక్కన మరొకరు కూర్చోకూడదన్న ఉద్దేశంతో పోలీసులు ఈ పని చేశారు.
ఐతే ఇదేం పద్దతంటూ విరుచుకుపడ్డ విద్యార్థులు… ఒకరిపై ఒకరు కూర్చోవడమే కాదు… ఒకరి భుజాలపై మరొకరు చేతులు కూడా వేసుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేశారు. విద్యార్థిని, విద్యార్థులు క్లాస్ రూమ్‌లో ఎలా కలిసి కూర్చుంటున్నారో… అదే పని చేశామని.. అనవసరమైన ఆంక్షలు పెట్టి.. అవమానించొద్దంటూ పోలీసులకు హితవు పలుకుతున్నారు. కేరళ విద్యార్థులు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనడంలో సందేహం లేదు. అది మరోసారి రుజవు చేశారు.