సమంత కొత్త సినిమా ఓటీటీలో..
సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించి, నటించిన కొత్త చిత్రం ‘శుభం’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఇది సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీగా రూపొందింది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని జూన్ 13న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్‌కు బాగా అలవాటు పడిపోతారు. సాధారణ వేళల్లో భర్తలతో మంచిగా ప్రవర్తించే స్త్రీలు సీరియల్స్ చూసే సమయంలో దయ్యాలుగా మారి పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు. దీంతో ఊర్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దీంతో బాధితులంతా పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి వెళ్తారు. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అసలు ఆ మహిళలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

