Home Page SlidermoviesNational

బాలీవుడ్ స్టార్‌తో సమంత డ్యాన్స్ వైరల్

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో పార్టీలో హీరోయిన్ సమంత డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి నటించిన సిటడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. దీనితో ఆ టీమ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. దీనిలో భాగంగా సమంత, వరుణ్ ధావన్‌లు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం జరిగిన ఈ సక్సెస్ పార్టీలో టీమ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వరుణ్ నటిస్తున్న ‘బేబీ జాన్’ అనే చిత్రంలోని ‘నైన్ మటక్కా’ అనే పాటకు వీరిద్దరూ హుక్ స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత అందమైన వ్యక్తులతో గడిపిన ఈ సాయంత్రం తన మనసు ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించింది. దీనికి వరుణ్ స్పందిస్తూ తన ‘బెస్ట్ కోస్టార్’ అంటూ సమంతను ప్రశంసించారు.