Home Page SlidermoviesNationalTrending Today

సమంతకు ఉత్తమనటి అవార్డు..

అందాల తార సమంత తాజాగా ఓటీటీ ఉత్తమనటి అవార్డు అందుకుంది. సమంత- వరుణ్ ధావన్ నటించిన వెబ్‌సిరీస్ సిటడెల్ హనీ-బన్నీ అనే సిరీస్‌లో సమంత నటనకు ఒక మీడియా సంస్థ ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డుపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఇష్టమైన ఎందరో హీరోయిన్స్ ఈ నామినీ బరిలో ఉన్నా కూడా తనకు ఈ అవార్డు రావడంపై ఆమె హ్యాపీగా ఫీలయ్యారు. తను చిత్రీకరణ సమయంలో మయోసైటిస్ వ్యాధి కారణంగా ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయానని, నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా, ఓపికతో తనను చూసుకున్నారని వెల్లడించారు. రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్‌ల సహకారంతోనే ఈ సిరీస్‌ను పూర్తి చేయగలిగానని పేర్కొన్నారు. ఇటీవల ఈ సిరీస్ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ వెబ్‌సిరీస్‌గా నిలిచింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది.