రష్మీక ఏజ్ పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రాబోయే చిత్రం ‘సికందర్’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న రంజాన్ పండుగకు రిలీజ్ కాబోతున్న మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సహనటి రష్మిక మందన్నకు తనకు మధ్య 31 సంవత్సరాల వయస్సు అంతరం గురించి నటుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “హీరోయిన్ మరియు నాకు మధ్య 31 సంవత్సరాల తేడా ఉందని అంటున్నారు. హీరోయిన్ మరియు ఆమె తండ్రికి ఎటువంటి సమస్య లేకపోతే, మీకు ఎందుకు సమస్య? ఆమె (రష్మిక) వివాహం చేసుకుని ఒక కుమార్తెను కలిగి ఉన్నప్పుడు, మరియు ఆమె పెద్ద స్టార్ అయినప్పుడు, మేము కూడా కలిసి పనిచేస్తాము. మేము ఖచ్చితంగా తల్లి (రష్మిక) అనుమతి తీసుకుంటాము…” అని చమత్కరించి సల్మాన్ మాట్లాడారు.

