నోరు జారిన సాయిపల్లవి..నెటిజన్ల ఫైర్
హీరోయిన్ సాయిపల్లవి ఇటీవలి చిత్రం ‘అమరన్’లో మంచి నటనతో అభిమానులను అలరించింది. అయితే అనుకోకుండా నోరు జారి ఆర్మీపై వ్యాఖ్యలు చేయడంతో వివాదంలో పడింది. ఇండియన్ ఆర్మీని కించపరిచారంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఆమె అమరన్ చిత్రం గురించి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి హింస మార్గం కాదని, ఇప్పుడు యుద్ధాలు అవసరం లేదంటూ పేర్కొన్నారు. అంతేకాక పాకిస్తాన్ వాళ్లు ఇండియన్ ఆర్మీని, భారతీయులు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపైనే ఇండియన్ ఆర్మీని సాయిపల్లవి అగౌరవపరిచారని మండిపడుతున్నారు.

