రిటైర్‌మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో రోహిత్ ఫామ్‌లో లేడని, కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించారని, ఇంక రిటైర్ అయిపోతాడని పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రోహిత్ స్పందించారు. “నాకు జట్టు అవసరాలే ముఖ్యం. సిడ్నీ టెస్టు నుండి మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నా. కీలకమైన పోరులో ఫామ్‌తో ఇబ్బంది పడడం జట్టును ప్రభావితం చేస్తుంది. మాకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. ఫామ్ పరంగా కేఎల్ రాహుల్ మెరుగ్గా ఉన్నాడు. అందుకే కేఎల్-యశస్వి జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నా ఫామ్‌పై, రిటైర్‌మెంట్‌పై ల్యాప్‌ట్యాప్‌లు ముందేసుకుని సమీక్షలు చేసేవారు నిర్ణయాలు తీసుకోలేరు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని. ఎప్పుడు ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయించుకుంటాను. తొందరలోనే ఫామ్‌లోకి వస్తాను. ఇప్పుడే రిటైర్ అవ్వట్లేదు.” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
BREAKING NEWS: ఐదో టెస్ట్‌లో ” కంగారు ” పడ్డారు

